వేదవాక్యమని యెంచిరి యీ



ప. వేద వాక్యమనియెంచిరియీ
వెలదులెల్ల సమ్మతించిరి

1. చీరలన్నియు వదలించిరియెంతో
సిగ్గు చేతనందునుంచిరి (వేద)

2. అందున నిలువక పోయెను మేను-
లందరికి తడువనాయెను (వేద)

3. కనుకొందురోయని సరగున పాలిండ్ల
కరముల మూయ మరుగునా (వేద)

4. మానములను మూసుకొందురో తమ
ప్రాణములను కాచుకొందురో (వేద)

5. చెలుల నోరెండగనాయెను నీరు
చిలు చిలుమనియెక్కువాయెను (వేద)

6. వల్వలు కానక పోయెను సతుల
వదనములటు స్రుక్కనాయెను (వేద)

7. కరగి కరగియంగలార్చిరి చెలులు
కమలాక్షునురమున జేర్చిరి (వేద)

8. కనుల కాటుక నీరు కారగా జూచి
కాంతుడెంతో ముద్దు కారగ (వేద)

9. రమణుల మదమెల్ల జరిగెను త్యాగ-
రాజ నుతుని మది కరగెను (వేద)

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ

వీడివో అల విజయరాఘవుడు