దిబ్బలు వెట్టుచు దేలినదిదివో

               
 || దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో | ఉబ్బు నీటిపై నొక హంస ||
|| అనువున గమల విహారమె నెలవై | ఒనరియున్న దిదె ఒక హంస |
మనియెడి జీవుల మానస సరసుల | వునికి నున్న దిదె ఒక హంస ||
|| పాలు నీరు నేర్పరచి పాలలో | నోలలాడె నిదె యొక హంస |
పాలుపడిన యీ పరమహంసముల | ఓలి నున్న దిదె యొక హంస ||
|| తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల | నుడుగక పొదిగీ నొక హంస |
కడు వేడుక వేంకటగిరి మీదట | నొడలు పెంచెనిదె యొక హంస ||
 

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ