హరి హరి రామ నన్నరమర జూడకు

  
హరి హరి రామ నన్నరమర జూడకు
నిరతము నీ నామస్మరణ మే మరను

దశరధ నందన దశముఖ మర్థన
పశుపతి రంజన పాప విమోచన || హరి ||

మణిమయ భూషణ మంజుల భాషణ
రణ జయ భీషణ రఘుకుల పోషణ || హరి ||

పతితపావన నామ భద్రాచలధామ
సతతము శ్రీరామ దాసు నేలుమా రామ || హరి ||

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి