ఓడను జరిపే ముచ్చట కనరే వనితలార నేడు

           


ప. ఓడను జరిపే ముచ్చట కనరే
వనితలార నేడు

అ. ఆడవారు యమునా కాడ కృష్ణుని కూడి
ఆడుచు పాడుచునందరు జూడగ (ఓ)

1. కొందరు హరి కీర్తనముల పాడ
కొందరానందమున ముద్దులాడ
కొందరు యమునా దేవిని వేడ
కొందరి ముత్యపు సరులసియాడ (ఓ)

2. కొందరు తడబడ పాలిండ్లు కదల
కొందరి బంగరు వల్వలు వదల
కొందరి కుటిలాలకములు మెదల
కొందరు పల్కుచు కృష్ణుని కథల (ఓ)

3. కొందరు త్యాగరాజ సఖుడేయనగ
కొందరి కస్తూరి బొట్టు కరగగ
కొందరి కొప్పుల విరులెల్ల జారగ
కొందరి కంకణములు ఘల్లనగ (ఓ)

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ