ఘుమ ఘుమ ఘుమయని వాసనతో



ప. ఘుమ ఘుమ ఘుమయని వాసనతో ముద్దు
గుమ్మలు వెడలిరి చూడరే

అ. మమతతోను సుర వరులెల్ల సుర తరు
సుమ వానలు కురియింపగ వేడ్కగ (ఘు)

1. నలు-వంక పగలు వత్తులు తేజరిల్లగ
చెలగ సాంబ్రాణి పొగలు గ్రమ్మ గంధ
పొడుల చల్లుచు పయ్యెదల తీయుచు
పన్నీరులు చిలుకుచు యదు కుల వీరునితో (ఘు)

2. బంగారు చీరలు రంగైన రవికలు-
నుంగరములు వెలయంగ సొగసుగా
భుజంగ శయనుడగు రంగ పతిని జూచి
పొంగుచు తనివార కౌగిలించుచును (ఘు)

3. వరమైన కనక నూపురములు ఘల్లన-
యురమున ముత్యాల సరులెల్ల కదలగ
కరమున సొగసైన విరి సురటులచే
విసరుచు త్యాగరాజ వరదుని పొగడుచు (ఘు)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట