తారకమంత్రము కోరిన దొరికెను

               
తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము||

మీరిన కాలుని దూతల పాలిటి
మృత్యువు యని మది నమ్మన్న ||తారక మంత్రము||

మచ్చికతో నితరాంతరమ్ముల
మాయలలో పడబోకన్నా
హెచ్చుగ నూట యెనిమిది తిరుపతు
లెలమి తిరుగ పనిలేదన్నా ||తారక మంత్రము||

ముచ్చటగా తా పుణ్యనదులలో
మునుగుట పని ఏమిటికన్నా
వచ్చెడి పరువపు దినములలో
సుడి వడుటలు మానకయున్న ||తారక మంత్రము||

ఎన్ని జన్మముల నుండి జూచినను
ఏకో నారాయణుడన్న
అన్ని రూపులై యున్న ఆ పరమాత్ముని

 నామము కథ విన్నా ||తారక మంత్రము||

ఎన్ని జన్మముల చేసిన పాపము

యీ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము
సత్యంబిక పుట్టుట సున్నా ||తారక మంత్రము||

నిర్మల అంతర్లక్ష్య భావమున
నిత్యానందముతో నున్న
కర్మంబులు విడి మోక్ష పద్ధతిని
కన్నులనే జూచుచునున్న ||తారక మంత్రము||

ధర్మము తప్పక భద్రాద్రీశుని
తన మదిలో నమ్ముకయున్న
మర్మము తెలిసిన రామదాసు హృ
న్మందిరమున కేగుచునున్న ||తారక మంత్రము||

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ