ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి

                  
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి || ననుబ్రోవమని ||

ననుబ్రోవమని చెప్పవే నారీ శిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మ || ననుబ్రోవమని ||

ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి చొక్కియుండెడివేళ || ననుబ్రోవమని ||

ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున నేక శయ్య నున్నవేళ || ననుబ్రోవమని ||

అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి || ననుబ్రోవమని ||

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి