మనసులోని మర్మమును

                
ప. మనసు లోని మర్మమును తెలుసుకో
మాన రక్షక మరకతాంగ నా (మనసు)

అ. ఇన కులాప్త నీవే కాని
వేరెవరు లేరు ఆనంద హృదయ (మనసు)

చ. మునుపు ప్రేమ-గల దొరవై సదా
చనువునేలినది గొప్ప కాదయ్య
కనికరంబుతోనీ వేళ నా
కరము పట్టు త్యాగరాజ వినుత (మనసు)

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి