ఇందుకేమి సేతుమమ్మ కృష్ణుడెంత మాటలాడెనమ్మ



ప. ఇందుకేమి సేతుమమ్మ
కృష్ణుడెంత మాటలాడెనమ్మ

అ. మగువలంటే ఇంత వాదా మాకు
మానమే ప్రాణము కాదా (ఇ)

1. గుస-గుసలందేమి వచ్చు చెలుల
ఉసురుంటే ఊరు పోవచ్చు (ఇ)

2. వనితల కనియెవరికైన కృష్ణా
వంచనగా పల్క తగునా (ఇ)

3. హఠము సేయ వేళ కాదు ఆత్మ
హత్య కాని వేరె లేదు (ఇ)

4. నగ్నముగా నిల్వ వశమా కృష్ణా
నలుగురిలో నీకు యశమా (ఇ)

5. నా మాటలు విని మీరు వేగ
నను గట్టు జేర్చ పోనీరు (ఇ)

6. లలనల పాపములేమో
ఈలాగు వ్రాతలుండెనేమో (ఇ)

7. వెలకు తీసిన వలపు రాదు కాన
వెలదులయిక నమ్మ రాదు (ఇ)

8. రాజన్య ఇటుయెంచ వలదు త్యాగరాజ
వినుత ప్రేమ కలదు (ఇ)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట