పెరుగు పాలు భుజియించి తనువుల



ప. పెరుగు పాలు భుజియించి తనువుల
పెంచినదెల్లనిందుకా

అ. నిరవధి సుఖ దాయక మా వయసు
నీటను కలయుటందుకా (పె)

1. అత్త మామలతో నీకై
మేమెదురాడినదెల్లయిందుకా
సత్త కలిగియికనైనాయుందుమని
సంతసిల్లినదిందుకా (పె)

2. ఆస తీర నీ సేవ వలయునని
అరసినదెల్లనిందుకా
బాసియుండ నేరక పెద్దలచే
బాముల జెందినదిందుకా (పె)

3. స్నాన పానములు సేయు వేళ నిను
ధ్యానము జేసినదిందుకా
మేనుల నీ సొమ్ములు జేయుటకై
మేమల్లాడినదిందుకా (పె)

4. తలిరు బోణులై యమునా నదిలో
తల్లడిల్లేదిందుకా
వలచుచు తొలి జన్మము రామునిచే
వరములు పడసినదిందుకా (పె)

5. కోటి జన్మములు తపములు జేసి
కోరినదెల్లనిందుకా
సాటి లేని నీ లీలలు మనసున
సైరించియున్నదిందుకా (పె)

6. ఆగమ నిగమ పురాణ చారుడని
అనుసరించినదిందుకా
త్యాగరాజ నుత తారక నామ నీ
తత్వము తెలిసినదిందుకా (పె)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట