రామజోగిమందుకొనరే ఓ జనులారా

      
       
రామ జోగిమందు కొనరే ఓ జనులారా || రామ ||
రామజోగి మందుమీరు - ప్రేమతో భుజియించరయ్యా
కామ క్రోధముల నెల్ల కటగు పారదోలే మందు || రామ ||

1. కాటుక కొండలవంటి - కర్మములెడబాపే మందు
సాటిలేని జగమునందు - మా స్వామి మందు || రామ ||


2. కోటి ధనములిత్తునని కొనబోయినా దొరకని మందు
సాటిలేని భాగవతులు కొనబోయిన మందు ||రామ|
 
సాటిలేని భాగవతూలు స్మరణ చేసె పామరులారా!!రామ!!

3. ముదముతో భద్రాద్రియందు - ముక్తిని పొందించే మందు
సదయుడైన రామదాసు - సద్భక్తితో గొలిచే మందు || రామ ||

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి