అల్లకల్లోలమాయెనమ్మ యమునాదేవి

       

ప. అల్లకల్లోలమాయెనమ్మ యమునా దేవి
మాయార్తులెల్లను తీర్పవమ్మ
అ. మొల్లలచే పూజించి మ్రొక్కెదము బ్రోవుమమ్మ (అ)
1. మారు బారికి తాళ లేకయీ రాజ
కుమారుని తెచ్చితిమిందాక
తారుమారాయె బ్రతుకు తత్తళించునదెందాక (అ)
2. గాలి వానలు నిండారాయె మా పనులెల్ల
గేలి సేయుటకెడమాయె
మాలిమితో మమ్మేలు మగనియెడ బాయనాయె (అ)
3. సొమ్ములెల్ల నీకొసగెదమమ్మ యమునా దేవియీ
సుముఖుని గట్టు జేర్పుమమ్మ
ఎమ్మె కాని బలిమినియేల తెచ్చితిమమ్మ (అ)
4. నళిన భవుడు వ్రాసిన వ్రాలుయెట్లైన కాని
నాథుడు బ్రతికియుంటే చాలు
ప్రళయములయ్యెను ఏ పని జేసిన భామలు (అ)
5. దేహములెల్లనొసగెదమమ్మ ఓ దేవి కృష్ణ
దేవుని గట్టు జేర్పుమమ్మ
మోహనాంగుని మేము మోస-బుచ్చితిమమ్మ (అ)
6. మేమొక్కటెంచ పోతిమమ్మ మా పాలి దేవు-
డేమోమో ఎంచుకొన్నాడమ్మ
రామరో శ్రీ త్యాగరాజాప్తుని బాయమమ్మ (అ)

Comments

  1. as usual...balamurali unparallal rendition of thyagayya geyam

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి