వాడేవాడే అల్లరి అల్లరివాడాదివో



వాడే వాడే అల్లరి అల్లరివాడాదివో
నాడునాడు యమునానదిలోన

కాంతలు వలయపుకంకణారవముల
నంతంత కోలాటమాడాగను
చెంతల నడుమన శ్రీరమణుడమరె
సంతతపు చుక్కలలో చంద్రునివలెను

మగువలు ముఖపద్మములు దిరిగిరా
నగపడి కోలాటమాడగను
నిగిడీ నడుమ నదె నీలవర్ణుడు
పగటుతో కమలబంధుని వలెను

గోపిక లోరీతి కోలాటమాడగ
యేపున శ్రీవేంకటేశ్వరుడు
వోపెలమేల్మంగ నురమున నిడుకొని
దీపించె మణులలో తేజము వలెను

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట