శ్రీరామ నామం మరువాం మరువాం

            
 శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్ధము యమునకు వెరువాం వెరువాం

గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం

విష్ణుకథలు చెవులు విందాం విందాం
వేరేకథలు చెవుల మందం మందం
రామదాసులు మాకు సారం సారం
కామదాసులు మాకు దూరం దూరం!!

నారాయణుని మేము నమ్మేం నమ్మేం
నరులనింక మేము నమ్మాం నమ్మాం
మాధవ నామము మరువాం మరువాం
మరి యమబాధకు వెరువాం వెరువాం!!

అవనిజపతి సేవ మానాం మానాం
మరియొకజోలంటే మౌనం మౌనం
శ్రీభద్రగిరీశుని కందాం కందాం
భద్రముతో మనముందాంముందాం!!

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం