కృష్ణా మాకేమి దోవ పల్కు



ప. కృష్ణా మాకేమి దోవ పల్కు
కీర్తి కల్గును దేవ దేవ బాల (కృ)

1. సరిగె రవికలెల్ల పోయె వెర్రి
చలికి మేనులోర్వనాయె బాల (కృ)

2. సరివారిలో సిగ్గు పోయె నీరు
జానులపై తాకనాయె బాల (కృ)

3. సర్వము నేననుకొన్న నీదు
సామర్థ్యము జూపు చిన్న బాల (కృ)

4. బాయ లేని మమ్ము నీవుయే
ఉపాయమైన తెల్పి బ్రోవు బాల (కృ)

5. మాతో చేరగయింత బాధ కల్గే
మరతుమాయిక ప్రాణ నాథ బాల (కృ)

6. ఇందుకనుచు తల్లి సాకెనో లేక-
యే పాపుల కండ్లు తాకెనో బాల (కృ)

7. రాకేందు ముఖ దయ రాదా త్యాగ-
రాజార్చిత బ్రోవ రాదా బాల (కృ)

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ