ఏ నోము నోచితిమో చెలులమేదానమొసగితిమో



ప. ఏ నోము నోచితిమో చెలులమే దానమొసగితిమో

అ. శ్రీ నాథు కొలువమరె చెలులు చెక్కిళ్ళునొత్తుచును
మానక మోవానుచు చంద్రానను హృదయముననుంచ (ఏ)

1. స్త్రీ రత్నములు మనము చెలులు శ్రీ మించు యౌవనము
వారిజ లోచనుడు చెలులు పాలాయె గదవమ్మ
కోరికలీడేరను యదు వీరుని కనులార జూడ(నే)

2. బంగారు సొమ్ములను చెలులు బాగుగ పెట్టుకొని
శృంగారాంబరములను చెలులు చెలువొంద కట్టుకొని
సంగతిగానంగములు శుభాంగునికినొసంగ మన(మే)

3. పొంగారుయీ నదిలో చెలులు పొందుగా గుమి కూడి
మంగళాకారునితో చెలులు మనసార కూడితిమి
రంగ పతియుప్పొంగుచు మన చెంగటను చెలంగగ మన(మే)

4. వాగీశాద్యమరులకు చెలులు వర్ణింప తరమౌనే
త్యాగరాజాప్తునితో చెలులు భోగములందుచును
బాగుగ తమి రేగగను నయ రాగములీలాగు పాడ (ఏ)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట