ఉన్న తావుననుండనియ్యదు వాన



ప. ఉన్న తావుననుండనియ్యదు వాన
ఉరుములైతే వెనక తియ్యదు

1. సుడి గాలియోడ జుట్టి వడి
వడిగా వానలైతే కొట్టి (ఉ)

2. ఓడలో రంధ్రము కలిగెయీ
వనితలకెవ్వరు సలిగె (ఉ)

3. కనులకెందు కాన రాదు గతి
కాళింది మనకిక మీదు (ఉ)

4. మతి పోవు దారి జనిరమ్మా అపుడే
మదమింత వద్దంటినమ్మా (ఉ)

5. మనమొక్కచో కూడ రాదు
ప్రళయమననిదిగా వేరు లేదు (ఉ)

6. రాజ వదనలు రారమ్మా త్యాగ-
రాజ సఖుని జూడరమ్మా (ఉ)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట