కంటి మా రాములను కనుగొంటి నేను

                 


ప: కంటి మా రాములను కనుగొంటి నేను || కంటి ||

1: కంటి నేడు భక్త గణముల బ్రోచు మా
యింటి వేలుపు భద్రగిరినున్న వాని || కంటి ||

2: చెలు వొప్పుచున్నట్టి సీతా సమేతుడై
కొలువు తీరిన మా కోదండరాముని || కంటి ||

3: తరణికుల తిలకుని ఘన నీలగాత్రుని
కరుణారసము కురియు కందోయి గలవాని || కంటి ||

4: హు రు మంచి ముత్యాలసరములు మెరయగా
మురిపెంపు చిరునవ్వు మోముగలిగిన వాని || కంటి ||

5: ఘలు ఘల్లుమను పైడిగజ్జెలందెలు మ్రోయగ
తళుకు బెళుకు పాదతలము గలిగిన వాని || కంటి ||

6: కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప
శర చాపములు కేల ధరియించు స్వామిని || కంటి ||

7: ధరణిపై శ్రీరామదాసు నేలెడు వాని
పరమ పురుషుండైన భద్రగిరిస్వామిని || కంటి ||


Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ