దుడుకుగల నన్నే

           
                               


ప. దుడుకు గల నన్నే దొర
కొడుకు బ్రోచురా ఎంతో (దు)

అ. కడు దుర్విషయాకృష్టుడై
గడియ గడియకు నిండారు (దు)

స్వర సాహిత్య -
1. శ్రీ వనితా హృత్కుముదాబ్జ
అవాఙ్-మానస గోచర (దు)

2. సకల భూతములయందు నీవై-
యుండగ మతి లేక పోయిన (దు)

3. చిరుత ప్రాయము నాడే భజనామృత
రస విహీన కు-తర్కుడైన (దు)

4. పర ధనముల కొరకునొరుల మది
కరగ పలికి కడుపు నింప తిరిగినట్టి (దు)

5. తన మదిని భువిని సౌఖ్యపు జీవనమే-
యనుచు సదా దినములు గడిపే (దు)

6. తెలియని నట-విట క్షుద్రులు వనితలు
స్వ-వశమౌటకుపదేశించి
సంతసిల్లి స్వర లయంబులెరుంగకను
శిలాత్ములై సు-భక్తులకు సమానమను (దు)

7. దృష్టికి సారంబగు లలనా
సదనార్భక సేనామిత ధనాదులను
దేవ దేవ నెర నమ్మితిని గాకను
పదాబ్జ భజనంబు మరచిన (దు)

8. చక్కని ముఖ కమలంబును సదా
నా మదిలో స్మరణ లేకనే
దుర్మదాంధ జనుల కోరి పరితాప-
ములచే తగిలి నొగిలి దుర్విషయ
దురాసలను రోయ లేక సతత-
మపరాధినై చపల చిత్తుడైన (దు)

9. మానవ తను దుర్లభమనుచునెంచి
పరమానందమొంద లేక
మద మత్సర కామ లోభ మోహులకు
దాసుడై మోస పోతి గాక
మొదటి కులజుడగుచు భువిని
శూద్రుల పనులు సల్పుచునుయుంటిని గాక
నరాధములను కోరి సార హీన
మతములను సాధింప తారుమారు (దు)

10. సతులకై కొన్నాళ్ళాస్తికై
సుతులకై కొన్నాళ్ళు ధన
తతులకై తిరిగితినయ్య
త్యాగరాజాప్త ఇటువంటి (దు)


Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ