దేవి బ్రోవ సమయమిదే

                 
రాగం: చింతామణి
తాళం: ఆది
శ్యామశాస్త్రి కృతి


ప: దేవి బ్రోవ సమయమిదే అతి వేగమె వచ్చి
అనుపల్లవి:
నా వెతలు దీర్చి కరుణించవే శంకరి కామాక్షి

1. లోక జనని నాపై దయలేదా
నీ దాసుడు గాద శ్రీ కంచి విహారిణి కళ్యాణి
ఏకామ్రేశ్వరుని ప్రియ భామయైయున్న
నికేమమ్మయంతో భారమా వినుమా నాతల్లి

2: రేపు మాపని చెప్పితే నే వినను
ఇక తాళను ఈ ప్రొద్దు దయ సెయవే కృప
జూడవే నీ పదాబ్జములే మదిలో సదా ఎంచి
ప్రాపు కోరియున్ననమ్మ ముదముతో మా తల్లి

3: శ్యామ కృష్ణ సోదరి కౌమారి
బింబాదరి గౌరి హేమచాలజే లలితే పరదేవతే
కామాక్షి నిన్నువిన భువిలో ప్రేమతో
కాపాఢేవారెవరున్నరమ్మ వినుమా మా తల్లి

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం