ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు

               


పల్లవి : ఎవ్వరెవ్వరి వాడొ ఈ జీవు-డు ఎవ్వరికి ఏమౌనొ ఏ జీవు-డు

1. ఎందరి-గొడుకుగాడీ జీవు-డు వెనక-
కెందరికి-దోబుట్ట-డీ జీవు-డు
ఎందరిని భ్రమయించ-డీ జీవు-డూ, దుఃఖమెందరికి-గావింప-డీ జీవు-డు

2. ఎక్కడెక్కడ-దిరుగడీ జీవు-డు, వెనక-
కెక్కడో తన జన్మమీ జీవు-డు
ఎక్కడి చుట్టము తనకునీ జీవు-డు, ఎప్పు-
డెక్కడికినేగునో ఈ జీవు-డు

3. ఏన్న-డును-జేటులేనీ జీవుడు, వెనక-
కెన్ని తనువులు మోవ-డీ జీవు-డు
ఎన్న-గల తిరు వేంకటేశు మాయల-దగిలి
ఎన్ని పదవుల-బొందడీ జీవు-డు.

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం