మంగళము గోవిందునకు



ప మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును
మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకూ, జయజయ
చ ఆదికినినాదైనదేవున కచ్యుతున కంభోజణాభున-
కాదికూర్మంబై నజగదాధారమూర్తికిని
వేదరక్షకునకును సంతతవేదమార్గ విహారునకు బలి-
భేదికిని సామాదిగానప్రియవిహారునకు


చ హరికి బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును
పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు
సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్ఠునకు కరుణా-
కరునకును గాత్యాయనీనుతకలితనామునకు
చ పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు
శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
వేంకటాచలవల్లభునకుమ విశ్వమూర్తికి నీశ్వరునకును
పంకజాకుచకుంభకుంకుమ పంకలోలునకు





Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం