శ్రీరామ జయరామ శృంగార రామయని



ప:  శ్రీరామ జయరామ శృంగార రామయని
చింతించరాదే ఓ మనసా
1. తళుకు జెక్కుల ముద్దు బెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ
2. దశరధుడు శ్రీరామ రారాయని బిలువ మును తపమేమి చేసెనో తెలియ
3. తనివారి పరిచర్య సేయ సౌమిత్రి మును తపమేమి చేసెనో తెలియ
4. తనవెంత జన జూచి యుప్పొంగ కౌసికుడు తపమేమి చేసెనో తెలియ
5. తాపమణగి రూపవతియౌట కహల్య పమేమి చేసెనో తెలియ
6. ధర్మాత్మ చరణంబుసోక శివచాపము తపమేమి చేసెనో తెలియ
7. తన తనయ నొసగి కనులార జనకుండు  తపమేమి చేసెనో తెలియ
8. దహరంబు కరుగ కరమునుబట్ట జానకి  తపమేమి చేసెనో తెలియ
9. త్యాగరాజాప్త యని బొగడ నారదమౌని తపమేమి చేసెనో తెలియ

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ

వీడివో అల విజయరాఘవుడు