బంగారు మురళి శృంగార రవళి

బంగారు మురళి - శృంగార రవళి
డెందములు మరచి - కను విందారగించేము
వచ్చేరా - మురిపెమిచ్చేరా ||బంగారు

అంగనలు పొంగారు జవ్వనము తెచ్చేరు
ముంగురులు నిమిరిరి - అనంగ మోహము తీరా
వచ్చేరా - మురిపెమిచ్చేరా ||బంగారు

నింగి రంగుల రేడు - ఖంగు మువ్వల జోడు
చెంగు నడకల నాడు - మంగళాంగుల వాడు 
వచ్చేరా - మురిపెమిచ్చేరా ||బంగారు
 https://www.youtube.com/watch?v=bnwWSDuyDXg&feature=share

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి