పరమేశ్వర వర భక్తవశంకర హరహర శంభో గిరిజా రమణా
పరమేశ్వర వర భక్తవశంకర
హరహర శంభో గిరిజా రమణా
ఇరముగ మా హృదయారవిందముల
వరదా వశియింపుము ప్రణతు
పరమేశ్వర వర భక్తవ శంకర
హర హర శంభో గిరిజా రమణా
గంగాధర కమనీయ జటాధర
అంగజారి సారంగ శశిధర
మంగళాంగ మహదానందకర
శంభో హర హర శివ సాంబసదాశివ
దీన పోషకుడవని నే వేడితి
దేవదేవ నీ పదములె నమ్మితి
కావ రావ కరుణానిధి
నా వ్యధ దీర్పవేరా దేవేశ మహేశా
Comments
Post a Comment