Wednesday, 19 April 2017

తలగరో లోకులు తడవకురో మమ్ము

|| తలగరో లోకులు తడవకురో మమ్ము | కలిగినదిది మాకాపురము ||
|| నరహరి కీర్తన నానిన జిహ్వ | వొరుల నుతింపగ నోపదు జిహ్వ |
మురహరు పదముల మొక్కిన శిరము | పరుల వందనకు బరగదు శిరము ||
|| శ్రీపతినే పూజించిన కరములు | చోపి యాచనకు జొరవు కరములు |
యేపున హరికడ కేగిన కాళ్ళు | పాపుల యిండ్లకు బారవు కాళ్ళు ||
|| శ్రీ వేంకటపతి జింతించు మనసు | దావతి నితరము దలచదు మనసు |

దేవుడతని యాధీనపు తనువు | తేవల నితరాధీనము గాదు ||

No comments:

Post a Comment