రామ నామము దొరకె రారండి

రామ నామం యొక్క గొప్పతనాన్ని వివరించే అతి గొప్ప పాటల్లో ఒకటిగా ఇది చెప్పుకోవచ్చు.

రామ నామము దొరకె రారండి-స్వామి నామము దొరకె రారండి
బ్రహ్మాదులకు కూడ బహుదుర్లభంబైన-భక్త కోటికి జీవనాధారంబైయున్న

శ్రీ గౌరి హృదయమున నిరతంబు చింతించు-దీక్షగా శివుడాత్మ విడువకా జపియించు
వాల్మీకి ముఖ్యులకు ప్రాణాధికంబైనట్టి-వనిత మోహనంబై వరలుచున్నట్టి
సుగ్రీవు ఎదలోని భయము బాపినయట్టి-ఆంజనేయుని ప్రాణధనమగుచు వెలుగొందు
ఆ అహల్యా సతి నుద్ధరించినయట్టి-బోయయగు శబరిని తరియింపచేసినయట్టి

ఆనిషాధుని గుహుని ఆదరించినయట్టి-అల విబీషణునికి ఆశ్రయంబొసగినయట్టి
ముసలి గద్దకు కూడ మోక్షమిచ్చినయట్టి-మును కోతులకు కూడ ముక్తినిచ్చినయట్టి

దండకారణ్య తాపసుల గాచినయట్టి-దానవోద్ధండ గర్వము చెండియున్నట్టి
సంసార వారాసి సంతరింపగ జేయు-శాంతి సౌఖ్యములిచ్చి సంరక్షణము జేయు

సనకాది మునిజనుల్ సంస్మరించినయట్టి-సర్వలోకాధారమై వెలుగుచున్నట్టి
తారక బ్రహ్మమై తనరారుచున్నట్టి-సర్వ రక్షణ చేయు మహిమ కలిగిన యట్టి

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి