శ్రీరామచంద్రునకు మంగళం


శ్రీరామచంద్రునకు మంగళం - మన సీతాదేవికి మంగళం
శ్రీరామ లక్ష్మణ సీతాంజనేయుల చేరి స్మరించిన వారలె ధన్యులు!!శ్రీరామ!!

౧. పరమాత్మునకిదె మంగళం హరిహరకమలజునకు మంగళం
భరత శత్రుఘ్నులు పరివేష్టించిన హరిగణముకు విభిషణునకు వరుసగ!!శ్రీరామ!!

౨. రఘుకులునకు జయ మంగళం మన రామునకిదె శుభ మంగళం
మఘపాలునకరి మర్దనునకు భక్తసుఖదాయికి దివ్యసుందరమూర్తికి!!శ్రీరామ!!

కరివరదునకిదె మంగళం బుధకామితదాయికి మంగళం
బీజపురంమున చిత్రకూటమున నారసింహ వచనాంబుజాత్యునకు!!శ్రీరామ!!

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి