వరవిధి సురమునులు ధరణీతో క్షీరాబ్ధి కరగి రావణుబాధాలెరుగాజెప్పి

వరవిధి సురమునులు ధరణీతో క్షీరాబ్ధి కరగి రావణుబాధాలెరుగాజెప్పి
పరిపారివిధమూలా ప్రస్తుతింపగ వారీ కరుణింపా బుట్టీనా కౌసల్యా రామా మంగళం మంగళం!!

బాలా లీలలు జూపి పాపీ తాటక ద్రుంచీ లీలా సుబాహూని కూలనేసీ
గాలీకోలచమాయే శాలీమారీచూని లీలాకడలి వైవ జాలిన రామా మంగళం మంగళం!! 

మౌనీ యాగముగాచి మౌని భార్యను బ్రోచి మౌనీ యానతి గూర్చి మన్నించి మించి
జనకుని పురిజేరి జగదీశు విలువిరచి జానకిని పెండ్లాడి జయమొందిన రామా!!

రావణాది దుష్టరాక్షసుల మర్దించి పావని మొదలైన భక్తుల గాంచి
దేవర్షుల ముదమున దేల్చి ధరనోదార్చి
దేవీతో కోసల దేశమేలిన రామా మంగళం మంగళం!!

హరి శివ విధిమంతా నీవై ముక్తి కరుగు వారికి మైన మూల తారకమై
ధర బీజాపుర భక్త నరసింహ వరదుడవై సిరితోడ నెలకొన్న చిన్మయుడా రామా మంగళం మంగళం!!

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం