రాధారమణా మాధవశౌరీ శ్రీధర గోవిందా

రాధారమణా మాధవశౌరీ శ్రీధర గోవిందా – మురారీ శ్రీధర గోవిందా!!
ఆధారంబవీ అఖిలాండంబుల కరయగ నొరులేరీ మురారీ అరరీ !!రాధా!!
౧. దయరాదేలా దశరథ బాలా దానవ సంహారా మురారీ దానవ సంహారా
భయమును దీర్పవే భక్త సుపాలా పావనతర లీలా మురారీ !!రాధా!!

౨. మారజనక నీ మరుగు జేరితిని కోరిక దీర్పుమయా మురారీ కోరిక దీర్పుమయా
భారమయ్యె సం-సారము నిను జేరు దారిజూపుమయ్య మురారీ !!రాధా!!

౩. నేరము లెంచకు నేనీ దాసుడ మారమణీ రామనా మురారీ మా రమణీ రమణా
కారణ కారణ కంసవిమర్దన నీరజ దళ నాయనా మురారీ నీరజ దళ నయనా !!రాధా!!

౪. శ్రీధర కృష్ణా తీరవిరాజిత చిత్రకూట నిలయా మురారీ చిత్రకూట నిలయా
మాధవ విధి రుద్రమయ శ్రీ నరసింహ మానస సంచారా మురారీ మానస సంచారా !!రాధా!!


Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి