హారతీమీరెలా ఈయారే అంబకూ


హారతీమీరెలా ఈయారే అంబకూ
మంగళ హారతీ మీరేల ఈయారే!!
హారతీ మీరేల ఈయరే జ్ఞానవిద్యలకెల్ల ప్రబలము
లీలతో పదహారు వన్నెల మేలిమీ బంగారు తల్లికి!!హారతీ!!

పాదములకూ పూజ సాయారే మాతల్లికిపుడు
పారిజాతపు హారమివ్వారే!!హారతీ!!

ఆణిముత్యపు హారాలు మొల నూలు గజ్జెలు జోడు అందెల రవల పాపట
బొట్టు ముక్కర సమయముగ ధరియించు తల్లికి!!హారతీ!!

ఇంత పారాకేలనానారే రుద్రునీ దేవికి చెంతనుండి పూజ సాయారే
శంకరీ ఓంకార రూపిణి కుంకుమస్థగితాలంకారి పొంకమైనయలంకారికి!!హారతీ!!

లక్షవత్తుల జ్యోతి గూర్చారే – చెలులార మీరూ
పచ్చని పళ్ళెముల వాల్చారే – రక్షితంబుగాను !!హారతీ!!

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం