బాలురతోనాడి చాలా అలిసీనావు

బాలురతోనాడి చాలా అలిసీనావు పాలుత్రాగ రార గోపాలా
పాలు త్రాగామని లీలతో ననుబిలిచి -- రోలగట్టెదవమ్మ రాజాల
పుండరీకాక్ష ... నీవెండలో దిరిగిన గుండెలెండె రార ... గోపాలా
గుండెలెండెనని ఖండించి ననుబిలచి ... దండింతువే తల్లి  రాజాల
వెన్నుఁడ ! నీ చిన్ని బొజ్జకింత వెన్నబెట్టెద రారా గోపాలా
వెన్నబెట్టెదనని సన్నుతింపుచు బిలచి -- సున్నా చుట్టెదవమ్మ రాజాల
ఎరా ! యదువంశ ధీరా !! శ్రీమన్నారాయణా రార !! గోపాల కృష్ణ ! నారాయణా రార గోపాలా !!
నారాయణా !! యని నాడే పిలచిన... నాడే వచ్చేదనింత సేపేలా ? తల్లి ! నాడెవచ్చేదనింత సేపేలా ? తల్లి !! నాడే వచ్చేదనింత సేపేలా !!

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ