దీనుడను నేను దేవుడవు నీవు


|| దీనుడను నేను దేవుడవు నీవు | నీ నిజరూపమే నెరపుటగాక ||
|| మతి జననమెరుగ మరణంబెరుగను | యితవుగ నినునింక నెరిగేనా
క్షితి బుట్టించిన శ్రీపతివి నీవు | గతి నాపై దయ దలతువు గాక ||
|| తలచపాపమని తలచపుణ్యమని | తలపున యిక నిన్ను దలచలేనా ||
అలరిననాలో అంతర్యామివి | కలుషమెడయ నను గాతువుగాక ||
|| తడవనాహేయము తడవనా మలినము | తడయక నీమేలు తడవేనా

విడువలేని శ్రీవేంకట విభుడవు | కడదాక నికగాతువు గాక ||

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ