ఛీ ఛీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక


ఛీ ఛీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక

అడవిలో మృగజాతియైన గావచ్చుగాక వడినితరుల గొలువఁగ వచ్చునా
వుడివోని పక్షియైవుండనైనవచ్చుగాక విడువకెవ్వరినైనా వేడవచ్చునా!!

పసురమై వెదలేని పాటుపడవచ్చుగాక కసివో నొరుల బొగడగావచ్చునా
వుసురుమానై పుట్టి వుండనైనవచ్చుగాక విసువక వీరివారి వేసరించవచ్చునా!!

యెమ్మెల బుణ్యాలుసేసి యిల యేలవచ్చుగాక కమ్మి హరిదాసుడు గావచ్చునా
నెమ్మది శ్రీ వేంకటేశ నీ చిత్తమేకాక దొమ్ముల కర్మములివి తోయవచ్చునా!!



Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం