రామరామరామ యన్న రామచిలుక ధన్యము


రామరామరామ యన్న రామచిలుక ధన్యము
రామప్రేమ చూరగొన్న చిట్టి వుడుత ధన్యము
అభినందనలందుకొన్న కోతిమూక ధన్యము
ఆశ్సీసులు పొందిన ఆ పక్షిరాజు ధన్యము
రేగుపండ్లు తినిపించిన శబరిమాత ధన్యము
నావ నడిపి దరిచేర్చిన గుహుని సేవ ధన్యము
పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము
వారధి నిలిపిన సాగరజలమెంతో ధన్యము     
నిదురమాని కాచిన సౌమిత్రి సేవ ధన్యము
పాదుకలను పూజించిన భరత భక్తి ధన్యము
అహరహము రామ అనే హనుమ జపము ధన్యము 
రామకధలు రచియించిన కవుల కవిత ధన్యము
త్యాగరాజ స్వామివారి సంకీర్తన ధన్యము 
భద్రాచల రామదాసు భక్తి ఎంతో ధన్యము
రాముని కరమున విరిగిన శివుని విల్లు ధన్యము 
రాముని పతిగా పొందిన సీత జన్మ ధన్యము
మధురాతి మధురము రెండక్షరాల మంత్రము 
సత్యధర్మమూర్తిత్వము  రాముని అవతారము
రామభక్తి పలికించిన రామగీతి ధన్యము
రామభక్తులందరికీ నిశ్చయముగ మోక్షము 

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ