ఏమీ సేతురా లింగా



ఏమీ సేతురా లింగా  ఏమి సేతూ
ఏమీ సేతురా లింగా ఏమి సేతూరా
ఏమీ సేతురా లింగా ఏమి సేతూరా
గంగ ఉదకము తెచ్చి నీకు లింగపూజలు చేదమంటే
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా మా లింగ ముర్తీ మా దేవ శంభో
ఏమీ సేతురా లింగా ఏమి సేతూరా
అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేదమంటే
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా మా దేవ శంభో మా లింగ ముర్తీ
ఏమీ సేతురా లింగా ఏమి సేతూరా
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే ఓహో
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా.అ
మహానుభావా మా దేవ శంభో మా లింగమూర్తీ
ఏమీ సేతురా లింగా ఏమి సేతూరా


Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ