అప్ప రామ భక్తియెంతో గొప్పరా



ప. అప్ప రామ భక్తియెంతో గొప్పరా మా(యప్ప)
అ. త్రిప్పటలను తీర్చి కంటి రెప్ప వలెను కాచునా మా(యప్ప)
1. లక్ష్మి దేవి వలచునా లక్ష్మణుండు కొలుచునా
సూక్ష్మ బుద్ధి గల భరతుడు జూచి జూచి సొలసునా మా(యప్ప)
2. శబరియెంగిలిచ్చునా చంద్ర ధరుడు మెచ్చునా
అబల స్వయంప్రభకు దైవమచల పదవినిచ్చునా మా(యప్ప)
3. కపి వారిధి దాటునా కలికి రోట కట్టునా
అపరాధి త్యాగరాజుకానందము హెచ్చునా మా(యప్ప)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం