మనసౌనే ఓరాధా మరల వేణువూద

మనసౌనే ఓరాధా మరల వేణువూద
ఘన శ్యామ సఖి శంపాంగనవై నర్తింపరాద!!   

మందలోని గోవులు మైమరచి మోరలెత్తి చూడ
బృందావని గడప గడప, అందెలు ఘల్లుమని యాడ,
చిందులలరు పదములు కాళిందీ తటమందు కూడ
సుందర గోపీ మండల మందు నిలిచి నీవు పాడ!!
  
ప్రతి నయనద్వయి నాపై, ప్రణయామృత ధార కురియ,
ప్రతి యెడంద నవ విద్యుల్లతయై నాహృదయ మొరయ,
ప్రతి వనమ్ము ప్రతి కుంజము, శ్రుతి లయాన్వితమై విరియ, 
ప్రతి స్వరమ్ము ప్రతి మూర్చన, ప్రణవ మంత్ర మౌచు మొరయ!! 

(‘స్వైరిణి’ నాటిక నుండి. 1959)

https://youtu.be/CH8XLlG7ug8?si=OXMYDbgOyuGm-5PY

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం