అమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ

 

ప. అమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ

: నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ!!అమ్మమ్మ!!

: నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని
ఈతడాతడి సతుల హౄదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా!!అమ్మమ్మ!!
 
: చక్కదనములె పెంచీ సకలముగాదలంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీరి
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ!!అమ్మమ్మ!!

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట