అలర చంచలమైన ఆత్మలందుండ



అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||
ఉదాయాస్త శైలంబు లొనర కంబములైన వుడుమండలము మోచే ఉయ్యాల
అదన ఆకాశపదము అడ్డదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టవెరపై తోచే వుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||అలర!!
మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||అలర!!
పాలిండ్లు కదలగా పయ్యెదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునో యని భీతి నొయ్య నొయ్యన నూచిరి ఉయ్యాల ||అలర!!
కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగలింపగజేసె ఉయ్యాల
 అమరాంగనలకు నీ హావ భావ విలాసమందంద చూపెనీ వుయ్యాల ||అలర!!
కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ