హరి హరి నీయొక్క దివ్య పాదారవిందమియ్యవే

ప. హరి హరి నీయొక్క దివ్య
పాదారవిందమియ్యవే

అ. ధరను కలుగు భోగ భాగ్యమెల్లను
తథ్యము కాదు సుమీ శ్రీ కృష్ణా (హ)

1. సనక సనందన శ్రీ నారద
శుకార్జున ఘనులెల్ల నుతించు
వనజ నయన బ్రహ్మాది
సంక్రందనలనయము సేవించు (హ)

2. విను వేద పురాణాగమ శాస్త్ర
విద్యలందు చరించు
ఘన సమ నీల నిరంజన నిర్గుణ
కనికరముగ త్యాగరాజు భావించు (హరి)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట