రావే రావే కోడల రట్టడి కోడల


రావే రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్త య్య పొందులు నీతో చాలును
రంకెలు వేయుచు రాజులెదుట నీవు కొంకు కోసరు లేని కోడల
పంకజ ముఖినీవు పలుదొడ్ల వారిండ్ల అంకెల దిరిగేవు అత్త య్యా
ఈడాడ నలుగురు నేగురు మొగలతో కూడి సిగ్గులేని కోడల
వాడక బదుగురి వలపించు కొని నీవు ఆడాదదిరి గేవు అత్త య్యా
బొడ్డున బుట్టిన పూపనికేనిన్ను గొడ్డేరు తెస్తి నే కోడల
గుడ్డము పయినున్న కోనేటి రాయని నడ్డగించు కుంటి నత్త య్యా

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం