సర్వేశ నీకిదే మంగళం

సర్వేశ నీకిదే మంగళం
సాధుపోషకా ఓ సాక్షీ రూపకా సర్వేశ నీకిదే మంగళం!!

నిర్వికార ఓ నిగమా గోచరా రామ
సర్వాకాలము నీ స్మరణా చేసెదను!!సర్వేశ!!

భావాతీత ఓ ప్రణవారూపకా రామ – దేవదేవ నన్ను బ్రోవ భారమా
సావధానమూ తోనూ బ్రోవుమా
భావమందుననిన్ భజియించెదను!!సర్వేశ!!

శరణు శరణనిన్ చేరి మ్రొక్కెదను – జనన మరణ బాధ మాన్పరాదయో
చరణ ధ్యానమునే మరువజాలను – పరమ పావనా బాలాంబ సద్గురు దేవ!!సర్వేశ!!

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ