వినయమునను కౌశికుని వెంట
ప. వినయమునను కౌశికుని వెంట చనినాంఘ్రులను జూచునదెన్నటికో అందు వెనుక రాతిని నాతి జేసిన చరణములను జూచునదెన్నటికో (వి) చ 1. ఘనమైన శివుని చాపము ద్రుంచిన పాదమును జూచునదెన్నటికో ఆ జనక రాజు పాల కడిగినయా కాళ్ళను జూచునదెన్నటికో (వి) చ 2. చనువున సీతను బొట్టు కట్టిన కరమును జూచునదెన్నటికో కోపమున భృగు సుతు చాప బలమందుకొన్న బాహువు జూచునదెన్నటికో (వి) చ 3. వనమున చని విరాధుని చంపిన చేతులను జూచునదెన్నటికో అల్ల ముని జనులను కని అభయమిచ్చిన హస్తమును జూచునదెన్నటికో (వి) చ 4. తనకు తానే కాకాసురుని కాచిన శరమును జూచునదెన్నటికో క్షణమున బహు రథముల పొడి చేసిన- యస్త్రమును జూచునదెన్నటికో (వి) చ 5. ఘన బలుడైన వాలిని చంపిన బాణమును జూచునదెన్నటికో ఆ వనధి మద గర్వమణచిన సాయకమును జూచునదెన్నటికో (వి) చ 6. కని కరమున విభీషణుని జూచిన కన్నులను జూచునదెన్నటికో రావణుని కొట్టి పేద కపులు లేవ జూచు దృష్టిని జూచునదెన్నటికో (వి) చ 7. వన చరాధిపుని చల్లగ జూచిన నేత్రమును జూచునదెన్నటికో దినమును లంక వర్ధిల్లను జూచు లోచనమును జూచునదెన్నటికో (వి) చ 8. ఘనమైన పుష్పకమున రాజిల్లిన సొగసు...