రమించు వారెవరురా రఘోత్తమా నినువినా Get link Facebook X Pinterest Email Other Apps May 02, 2019 పల్లవి రమించు వారెవరురా రఘోత్తమా నినువినా అనుపల్లవి శమాది షడ్గుణగణ సకల భువన జనులలో (రమించు) ౧. రమయనే సుమర్మము రామయనే శర్మము తదమరవరుల కబ్బెనో త్యాగరాజ సన్నుతా (రమించు) Get link Facebook X Pinterest Email Other Apps Comments
భో శంభో శివ శంభో స్వయంభో March 18, 2014 ప. భో శంభో శివ శంభో స్వయంభో అ.ప. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక |4| !! భో శంభో!! చ. 1. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమగమ భూత ప్రపంచ రహిత నిజపుర నిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ !! భో శంభో!! చ. 2. ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిటతోం - తోం తోం తిమికిట తరికిట కిటతోం - మతంగ మునివర వందిత ఈశా సర్వ దిగంబర వేష్టితవేష నిత్య నిరంజన నిత్యనటేశ - ఈశ సభేశ సర్వేశ !! భో శంభో!! | మతంగ ... | మతంగ మునివర వందిత ఈశ శర్వ దిగంబర వేష్టితవేష - 2 నిత్య నిరంజన నిత్యనటేశ - 2 ఈశ సభేశ సర్వేశ !! భో శంభో! Read more
మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం March 13, 2018 మంగళం జయ మంగళం .. మా నల్లనయ్యకు మంగళం .. ||2|| మంగళం జయ మంగళం .. మా కృష్ణ స్వామికి మంగళం .. ||2|| || మంగళం || శిరమునందున మెరయుచుండెడి నెమలి పింఛకు మంగళం .. ||2|| శ్యామలాంగుని కరములందలి మధురమురళికి మంగళం ..||2|| || మంగళం || వనజగమ్మును ధిక్కరించెడి వదనశోభకు మంగళం ...||2|| కరుణరసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం ..||2|| || మంగళం || బ్రహ్మచే పూజింపబడిన చరణయుగళికి మంగళం ..||2|| జగములన్నియు కన్నతండ్రగు చక్కనయ్యకు మంగళం .. ||2|| || మంగళం || గోపికా గణసేవితుడు శ్రీ గోవిందునకు మంగళం .. ||2|| రాధికా పరివేష్టితుండౌ రసేశ్వరునకు మంగళం ... ||2|| || మంగళం || Read more
వీడివో అల విజయరాఘవుడు December 16, 2013 వీడివో అల విజయరాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ || రాముడు లోకాభిరాముడు గుణ ధాముడసురులకు దమనుడు తామర కన్నుల దశరధ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ || కోదండధరుడు గురుకిరీటపతి కోదిగసురముని పూజితుడు అదిమపురుషుడు అంబుదవర్ణుడు నీ దెసచుపులు నించే చెలియ || రావణాoతకుడు రాజశేఖరుడు శ్రీవేంకటగిరి సీతాపతి వావిలి పాటిలో వరమూర్తి తానై వోవరి కొలువున ఉన్నాడే చెలియ || Read more
Comments
Post a Comment