Posts

Showing posts from December, 2013

మైత్రీం భజత

Image
                   మైత్రీం భజత , అఖిల హృత్ జైత్రీం ఆత్మవదేవ పరాన్నపి పశ్యత యుద్ధం త్యజత , స్ఫర్ధాం త్యజత త్యజత పరేషు అక్ర మాక్ర మణం !! జననీ పృథివీ కామదు ఘాస్తే జనకో దేవః సకల దయాళుః ' దామ్యత , దత్త , దయధ్వం ' జన తాః శ్రేయో భూయాత్ సకల జనానాం !!   (ఈసందేశం 23 అక్టోబర్, 1966 ఐక్యరాజ్య సమితిలో శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారిచే గానం చేయబడింది.). కంచి మహాస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ప్రసాదించిన సంస్కృత గీతం. దీనిని ’అంతర్జాతీయ గీతం’గా పేర్కొనవచ్చు. "అందరి హృదయాలనీ జయించే ’మైత్రి’ని మనం స్వీకరించాలి. ఇతరుల్ని ’మన’లాగే చూడాలి. యుద్ధాన్నీ, స్పర్థనీ, అక్రమమైన ఆక్రమణలని విడనాడాలి. అన్ని కోరికలూ తీర్చే ఈ భూమి మన తల్లి. సర్వేశ్వరుడు, దయామయుడు భగవంతుడే మన తండ్రి. దామ్యత - నిగ్రహణ కావాలి. ’దత్త’ , అవసరంలో ఉన్నవారిని ఆదుకొనేలా సహాయాన్ని అందించాలి. ’దయధ్వం’ - సానుభూతితో కూడిన సహకారభావమే ’దయ’, దానిని చూపించాలి ఈమూడు ’ద’కారాలు కావాలి. సకల జనములకు శ్రేయస్సు కలగాల...

పరతత్వంబగు బాలుడు

పరతత్వం బగు బాలుడు పరిపరివిధముల బాలుడు చద్దులమూటలు చంకల వ్రేలెడి ముద్దులపడుచుల మూకలతో పెద్దరికంబున పేయల( గాచిన బద్దులనటనల బాలుడూ !! వెన్నలుదాకగ వేట్లాడుచును సన్నపుబడుచుల సంగడిని కన్నెలు దూరగ కలకల నవ్విన పన్నిన మాయల బాలుడు !! బచ్చన రూపుల పాయపుబడుచులు నిచ్చలు కొలువగ నెమ్మదిని నచ్చిన వేంకట నగమున నాడెడి పచ్చిలపదకపు బాలుడు!!

ఇటు గరుడని నీ వెక్కినను

    ఇటు గరుడని నీ వెక్కినను  పటపట దిక్కులు బగ్గన బగిలె ఎగసినగరుడని యేపున ' ధా ' యని  జిగిదొలకచబుకు చేసినను నిగమాంతంబులు నిగమసంఘములు  గగనము జగములు గడగడ వడకె !!ఇటు!! బిరుసుగ గరుడని పేరెము దోలుచు  బెరసి నీవు గోపించినను సరుస నిఖిలములు జర్జరితములై  తిరువున నలుగడ దిరదిర దిరిగె !!ఇటు!! పల్లించిననీపసిడిగరుడనిని  కెల్లున నీవెక్కినయపుడు ఝల్లనె రాక్షససమితి నీ మహిమ  వెల్లి మునుగుదురు వేంకటరమణ!!ఇటు!!

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా తరవాత నా మోము తప్పకిటు చూడు మేలుకొను నాయన్న మెల్లనే నీతోడి బాలులదె పిలిచేరు బడి నాడను చాలు నిక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు - వేళాయ నాతండ్రి వేగ లేవే. కను దెరవు నాతండ్రి కమలాప్తు డుదయించె వనిత మొకమజ్జనము వడి దెచ్చెను మొనసి మీతండ్రి యిదె ముద్దాడజెలగీని దనుజాంతకుండ యిక దగ మేలుకోవే లేవె నాతండ్రి నీలీలలటు వోగడేరు శ్రీ వేంకటాద్రిపతి శ్రీరమణుడా దేవతలు మునులు జెందిననారదాదులు ఆవలను బాడేరు ఆకసమునందు.

ఆడరమ్మా పాడరమ్మా

ఆడరమ్మా పాడరమ్మా అందరు మీరు వేడుక సంతసంబులు వెల్లివిరియాయను కమలనాభుడు పుట్టె కంసుని మదమణచ తిమిరి దేవకి దేవి దేహమందు అమరులకు మునులకభయమిచ్చె నితడు కొమరె గొల్లెతలపై కోరికలు నిలిపె రేయిపగలుగ చేసి రేపల్లె పెరుగుజొచ్చె ఆయెడా నావుల గాచె నాదిమూలము యీ యెడ లోకాలు చూపె నిట్టే తనకడుపులో మాయసేసి యిందరిలో మనుజుడైనిలిచె బాలలీలలు నటించి బహుదైవికము మించె పాలువెన్నలు దొంగిలె పరమమూర్తి తాళిభూభారమణచె ధర్మము పరిపాలించె మేలిమి శ్రీవేంకటాద్రి మీద నిట్టె నిలిచె

మునుల తపమునదే మూల భూతియదే

Image
                  ప:మునుల తపమునదే మూల భూతియదే వనజాక్షుడే గతి వలసినను || చ:నరహరి నామము నాలుక నుండగ పరమోకరినడుగా పని ఎలా చిరపుణ్యమునదే జీవ రాక్షయదే సరుగగాచు నొకసారే నుడిగిన || చ:మనసులోననే మాధవుడుండగా వెనుకోనియోకచో వేదగాక నేటికి కొనకు కొన అదే కోరేడిదదియే తనుదా రక్షించు తలచినను || చ:తిరువేంకటగిరి చేరువనుండగా భావకర్మముల భ్రమయగనేటికి దేవుడు నతడే తెరువు నదియె కావలనంటే కావగపోడు ||

ఏదాయ నేమి హరి ఇచ్చిన జన్మమే చాలు

Image
                        ఏదాయ నేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆదినారాయణుడీ అఖిలరక్షకు(డు శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని తనకది హీనమని తలచుకోదు మనసొడబడితేను మంచిదేమి కానిదేమి తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు పురువు కుండే నెలవు భువనేశ్వరమై తోచు పెరచోటి గుంతయైన ప్రియమై యుండు యిరవై ఉండితే చాలు యెగువేమి దిగువేమి వరుస లోకములు "సర్వం విష్ణు మయము" అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే చెచ్చెర తన తిమ్మటే జీవన్ముక్తి కచ్చుపెట్టి శ్రీవేంకటపతికిదాసుడైతే హెచ్చుకుందేమి లేదు యేలినవాడితడే

వీడివో అల విజయరాఘవుడు

Image
                            వీడివో అల విజయరాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ || రాముడు లోకాభిరాముడు గుణ ధాముడసురులకు దమనుడు తామర కన్నుల దశరధ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ || కోదండధరుడు గురుకిరీటపతి కోదిగసురముని పూజితుడు అదిమపురుషుడు అంబుదవర్ణుడు నీ దెసచుపులు నించే చెలియ || రావణాoతకుడు రాజశేఖరుడు శ్రీవేంకటగిరి సీతాపతి వావిలి పాటిలో వరమూర్తి తానై వోవరి కొలువున ఉన్నాడే చెలియ ||

భావములోన బాహ్యమునందును

Image
                   భావములోన బాహ్యమునందును  గోవిందగోవిందయని కొలువవో మనసా హరియవతారములే అఖిలదేవతలు  హరిలోనివే బ్రహ్మాణ్డములు హరినామములే అన్ని మంత్రములు  హరిహరి హరిహరి యనవోమనసా!! విష్ణుని మహిమలే విహిత కర్మములు  విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు  విష్ణువు విష్ణువని వెదకవో మనసా!! అచ్యుతుడితడె ఆదియునంత్యము  అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె  అచ్యుత అచ్యుత శరణనవో మనసా !!

ఇతనికంటే మరిదైవము కానము

Image
                        ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె || మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి చెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ తలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు || పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడు మించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారము అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||

పావన రామ నామ

    ప: పావన రామ నామ సుధారస పానము జేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచే దెన్నటికో || పావన రామ || చ1: దాసులగని సంతోషమ్మున తవ దాసోహమ్మను టెన్నటికో భూ సుతకుసు నతి ప్రాణప్రదంబగు పురుషోత్తము గనుటెన్నటికో || పావన రామ || చ2: చంచల గుణములు మాని సదా ని శ్చలమతి నుండేదెన్నటికో పంచ తత్వములు తారక నామము పఠియించుట నా కెన్నటికో || పావన రామ || చ3: ఇనవంశాంబుధి చంద్రుడు కృపతో ఇష్టము లొసగే దెన్నటికో కనకచేలు కరుణాలవాలుని కన్నుల జూచే దెన్నటికో || పావన రామ || చ4: వంచన లేకను భద్రాదీశుని వర్ణన చేసేదెన్నటికో అంచితముగ రామదాసుడనుకొని ఆనందించే దెన్నటికో || పావన రామ ||

సేవింపరో జనులాల చేరి మొక్కరో

Image
                       సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింప నున్నాడిందరి భాగ్యము వలెను జలకమాడి వున్నాడు సర్వేశ్వరుడు నిగ్గు గలిగిన మంచి నల్లకలువ వలే ఎలమి కప్పురకాపు ఇదె చాతుకున్నవాడు వెలలేనియట్టి పెద్ద వెండికొండవలెను || అందముగా తట్టుపుణుగు అలదుక నున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలెను ముందటి వలెనె తా సొమ్ములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టినిల్లువలెను || మించి అలమేల్మంగ మెడగట్టుకొన్నవాడు పొంచి బంగారు తామరపువ్వువలెను ఎంచగ శ్రీవేంకటేశుడిదె కొలువై ఉన్నవాడు నించిన దాసులపాలి నిధానము వలెను ||