చూడరే చెలులార
చూడరే చెలులారా - పంతువరాళి రాగం ప. చూడరే చెలులార యమునా దేవి సొగసెల్ల సంతోషమున 1. ఎర్రని పంకే-రుహములే అందు ఇంపైన భ్రుంగనాదములే!!చూడరే!! 2. ఇసుక దిన్నెలెంత తెలుపే మేను ఇంద్ర నీలము వంటి నలుపే!!చూడరే!! 3. మేటికలు వజ్రంపు శిలలే అందు కుటిలమైన చిన్నయలలే!!చూడరే!! 4. హంసల రవళిచే చాల దేవి అదిగో చెలంగెనీ వేళ!!చూడరే!! 5. పొలతులార పొదరిండ్లే తేనెలొలుకు ఖర్జూరపు పండ్లే!!చూడరే!! 6. ఫలముచే ద్రాక్ష లతలే అందు పచ్చని చిలుకల జతలే!!చూడరే!! 7. వింత వింత విరుల వాన మదికెంతెంతో మరులయ్యెనే!!చూడరే!! 8. కోకిలములు మ్రోసెనే మరుడు కుసుమ శరంబులేసెనే!!చూడరే!! 9. చల్లని మలయా మారుతమే కృష్ణ స్వామిని కూడునది సతమే!!చూడరే!! 10. రాజ వదనలార కనరే త్యాగరాజ సఖుని పాట వినరే!!చూడరే!! ఏమని నెర నమ్ముకొందుము - సౌరాష్ట్రం రాగం 1. ఏమని నెర నమ్ముకొందుము కృష్ణా ఎందుకింత వాదు 1. జలకమాడు వేళ వలువలు దాచి మమ్మలయింపగ లేదా కృష్ణా!!ఏమని!! ...