Posts

Showing posts with the label అన్నమయ్య జానపదాలు

రావే రావే కోడల రట్టడి కోడల

Image
రావే రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్త య్య పొందులు నీతో చాలును రంకెలు వేయుచు రాజులెదుట నీవు కొంకు కోసరు లేని కోడల పంకజ ముఖినీవు పలుదొడ్ల వారిండ్ల అంకెల దిరిగేవు అత్త య్యా ఈడాడ నలుగురు నేగురు మొగలతో కూడి సిగ్గులేని కోడల వాడక బదుగురి వలపించు కొని నీవు ఆడాదదిరి గేవు అత్త య్యా బొడ్డున బుట్టిన పూపనికేనిన్ను గొడ్డేరు తెస్తి నే కోడల గుడ్డము పయినున్న కోనేటి రాయని నడ్డగించు కుంటి నత్త య్యా