Posts

Showing posts with the label హరియే గతి

హరియేగతి సకలచరాచరములకును

Image
  హరియేగతి సకలచరాచరములకును హరియేగతి విరించి రుద్రాదులకైనా ముద్దులబాలుడై మురళిని చేపట్టి బాలమురళివై నాదము పూరించి ముల్లోకములను మునులను సైతము మురిపించి మైమరపించి ఆయా యుగముల ధర్మము నిలుపగ అవతారములను దాల్చిన దైవము హయవాహనుడై కలియుగమందున అలమేలుమంగాపతియై వెలసిన భస్మాసురులు నమవంచకులు అసనశూరులు పలుశిశుపాలులు పట్టిబాధించి యిట్టితరుణమున పాలనసేయుటకెవరు మాకెవరు