Posts

Showing posts with the label యదుకుల కాంభోజి రాగం

అది కాదు భజన మనసా

Image
      ప. అది కాదు భజన మనసా అ. ఎదలోనెంచుటొకటి పయ్యెద కల్గినచోనొకటి (అది) చ. గొప్ప తనముకైయాస కుత్సిత విషయ పిపాస మెప్పులకై బహు వేసమిడి ఉబ్బతిల్లెదరు త్యాగరాజ వినుత (అది)

హెచ్చరిక గా రా రా హే రామచంద్రా

Image
                     ప . హెచ్చరికగా రారా హే రామ చంద్ర హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర అ . పచ్చ విల్తునికన్న పాలిత సురేంద్ర ( హెచ్చరిక ) చ 1. కనక మయమౌ మకుట కాంతి మెరయగను ఘనమైన కుండల యుగంబు కదలగను ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను సనకాదులెల్ల కని సంతసిల్లగను ( హెచ్చరిక ) చ 2. ఆణి ముత్యాల సరులల్లలాడగను వాణి పతీంద్రులిరు వరుస పొగడగను మాణిక్య సోపానమందు మెల్లగను వీణ పల్కుల వినుచు వేడ్క చెల్లగను ( హెచ్చరిక ) చ 3. నిను జూడ వచ్చు భగిని కరంబు చిలుక మనసు రంజిల్ల నీ మహిమలను పలుక మిను వాసులెల్ల విరులను చాల జిలుక ఘన త్యాగరాజు కనుగొన ముద్దు గులుక ( హెచ్చరిక )